ప్రాంతీయం

రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ

47 Views

ప్రాథమిక పాఠశాల చేబర్తి లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ

సిద్దిపేట జిల్లా, జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7 )

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చేబర్తి లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీనీ మర్కూక్ మండల విద్యాధికారి వెంకట్రాములు,మర్కుక్ మండల ఎంపీడీవో విక్రమ్,గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి, తో కలిసి ప్రారంభించారు. లైబ్రరీ లో పిల్లల స్థాయికి అనుగుణంగా 600 పుస్తకాలు అందించడం జరిగినది. స్టడీ టేబుల్ 4, దరి చాపలు 4, బీరువాలు 4, తరగతి సి ఐ సి ఓ, రిజిస్టర్ సమకూర్చడం జరిగినది. మండల విద్యాధికారి వెంకట్రాములు, మాట్లాడుతూ లైబ్రరీ ఆవశ్యకతను గురించి తెలియజేస్తూ లైబ్రరీలో పిల్లల స్థాయికి అనుగుణంగా కథల పుస్తకాలు అందుబాటులో ఉన్నవి. వాటిని చదివిస్తూ ప్రతి పిల్లవాడికి రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి అని వివరించారు. ప్రీ ప్రైమరీ తరగతి గదికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భీమా ఆర్థిక సహకారంతో ప్రీ ప్రైమరీ తరగతి గదికి రంగురంగుల బొమ్మలతో పెయింటింగ్ చేయించడం జరిగినది. ఇందుకుగాను 45 వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించడం జరిగినది. ఇట్టి ప్రీ ప్రైమరీ తరగతి గదిని మండల విద్యాధికారి వెంకట్రాములు , ఎంపీడీవో విక్రమ్,డిస్టిక్ లయన్ గవర్నర్ అమర్నాథ్ రావు, గ్రామ సర్పంచి ర్యాకం యాదగిరి,తో కలిసి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో చేయబర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శంకర్ రెడ్డి,గ్రామ ఉపసర్పంచ్ శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహులు, ఏ ఏ పి సి చైర్మన్ అఖిల, వార్డు సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు ఉమారాణి,జ్యోతి,శ్రీధర్,కమలాకర్ రెడ్డి,రాణి రూమ్ టు రీడ్ కో ఆర్డినేటర్ పల్లె వెంకన్న, విద్యార్థుల తల్లిదండ్రులు యువకులు పాల్గొన్నారు. చేబర్తి నూతన గ్రామపంచాయతీ పాలక వర్గాన్ని పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించడం జరిగినది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *