ప్రాంతీయం

జిల్లా కలెక్టర్ కే. హైమవతి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం..

39 Views

జిల్లా కలెక్టర్ కే. హైమవతి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం..

సిద్దిపేట్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ కే. హైమవతి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10736 కోట్ల రూపాయల రుణాల లక్ష్యంగా నిర్ణయించగా 2025 డిసెంబర్ నాటికి 68%తో 7309 కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగిందని ఈ నెలాఖరులోగా 2025-26 లక్ష్యంలో మిగతా రుణాలను కూడా అందించాలని ఆదేశించారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆయా బ్యాంకుల రుణ నిల్వలు  మార్కెట్ షేర్ ఆధారంగా బ్యాంకులవారీగా ఏప్రిల్ మాసంలో ప్రయారిటీ  నాన్ ప్రయారిటీ అరుణ లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుందని వాటిని సాధించేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణ ప్రణాళిక 2025-26 సంవత్సరానికి రుణాల మంజూరు కొరకు ఏప్రిల్ 2 చివరి తేదీతో దరఖాస్తు చేసుకునేందుకు ప్రకటన ఇవ్వడం జరిగిందని సబ్సిడీతో అందించే ఆయా రుణాలను కూడా నిర్దిష్ట సమయంలో లబ్ధిదారులకు అందించాలని అన్నారు. ఇవే కాకుండా ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల రుణాలు, పరిశ్రమల శాఖ రుణాలు, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ  మెప్మా ద్వారా మహిళా సంఘాలకు అందించే రుణాలను, వ్యవసాయ రుణాలను నిర్దేశిత లక్ష్యం మేరకు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, ఎల్డీఎం హరిబాబు, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయ్ భార్గవ్, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *