గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో మహతి విద్యనికేతన్ హై స్కూల్,లోపోలింగ్ సెంటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట జిల్లా, గజ్వేల్, ఫిబ్రవరి 11, తెలుగు న్యూస్ 24/7
గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో మహతి విద్యనికేతన్ హై స్కూల్, బి ఎం ఆర్ డిగ్రీ కళాశాల,మైనారిటీ వెల్ఫేర్ కంప్యూటర్ సెంటర్ సెట్విన్ శిక్షణ సంస్థ,ప్రాథమిక పాఠశాల హరిజనవాడ లోనీ పోలింగ్ స్టేషన్ లలో ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లాఎన్నికలఅధికారిమాట్లాడుతూ.జిల్లాలో దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీలలో 72 వార్డులలో 176 పోలింగ్ కేంద్రం లలో ఓటింగ్ సరళి ప్రశాంత వాతావరణంసజావుగాసాగుతుందనితెలిపారు.సాయంత్రం 5 లోపల పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అనుమతి కల్పించాలని 5 దాటక గేట్ లు మూసివేయాలని తెలిపారు.ఓటింగ్ సరళి ముగిసిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం ప్రతిదీ చెక్ చేసుకుని బ్యాలెట్ బాక్స్ లాక్ వేసి సీల్ వేసి రూట్ ఆఫీసర్ ద్వారా పోలీస్ ఎస్కార్ట్ ద్వారానే రిసెప్షన్ సెంటర్ కి వెళ్ళాలని తెలిపారు.రిసెప్షన్ సెంటర్ లో అన్ని అరేంజ్మెంట్ లు చూసుకుని బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది అందరికీ రాత్రి భోజన సదుపాయాల్లో ఎలాంటి లోటు రాకుండ చూసుకోవాలని అలాగే వారు వారి స్వగృహాలకు వెళ్లడానికి ఆయా రూట్ ల వారిగా బస్సు సౌకర్యం అందించాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ ఆర్డీవో చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, తహసిల్దార్ శ్రావణ్, పోలీస్ తదితరులు ఉన్నారు.





