ప్రాంతీయం

కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిశోర్ ఝా, ఐ పి ఎస్., ఎదుట 08 మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ మావోయిస్టు ల లొంగుబాటు

30 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిశోర్ ఝా, ఐ పి ఎస్., ఎదుట 08 మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ మావోయిస్టు ల లొంగుబాటు

*లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలను అందచేస్తాం.*

ఈ రోజు అనగా, .24.01.2026 తేదీన నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ సభ్యులు రామగుండం కమిషనరేటు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహాకారాలు మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని, తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని, కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఎదుట కమిషనరేటు కార్యాలయంలో లొంగిపోయారు.

*లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరములు:*

లొంగిపోయిన ఎనిమిది మంది వ్యక్తులు మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ వంటి విభాగాల్లో క్రియాశీలకంగా పని చేశారు. వీరు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. ధర్మాజీ శ్రీకాంత్, తండ్రి: భీమయ్య, వయస్సు: 33 సంవత్సరాలు, ప్రస్తుతం నివాసం: ఇటీక్యాల LXPT N/o చెగ్యాం గ్రామం, వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా.
2019 నుండి CPI (మావోయిస్టు) కోరియర్‌గా పనిచేశాడు. 2024లో వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు అయ్యాడు. జైలు నుండి విడుదలైన అనంతరం మళ్లీ తిరిగి ఛత్తీస్‌గఢ్‌లో పార్టీలో చేరి, పార్టీ మెంబర్‌గా ప్రమోషన్ పొందాడు. కంకనాల రాజిరెడ్డి, ఆజాద్, దామోదర్ వంటి సీనియర్ మావోయిస్టు నాయకులకు కొరియర్‌గా పనిచేశాడు.

2. పొడియం కాములు, వయస్సు: 30 సంవత్సరాలు, మిలీషియా కమాండర్. స్థానిక మిలీషియా సమీకరణ మరియు నాయకత్వంలో కీలక పాత్ర పోషించాడు. 2024 లో దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ అయినాడు, మరల 2025 లో విడుదలై తన కార్యకలాపాలను కొనసాగించాడు.

3. ముడియం జోగ, , వయస్సు: 25 సంవత్సరాలు, చైతన్య నాట్య మండలితో సంబంధం కలిగి, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

4. కుంజం లక్కె (స్త్రీ), వయస్సు:23 సంవత్సరాలు, పార్టీ మెంబర్. భద్రు ఆధ్వర్యంలో పనిచేసింది. ఆంధ్రి ఎన్‌కౌంటర్‌లో తప్పించుకుంది. ఆ ఎన్‌కౌంటర్‌లో వరంగల్‌కు చెందిన మాచెర్ల యేసోబు @ జగన్ (RCM) చనిపోయాడు.

5. మోదం భీమ, వయస్సు:30 సంవత్సరాలు, మిలీషియా సభ్యుడు. మావోయిస్టు కి స్థానిక సహాయక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.

6. కుంజం ఉంగా, వయస్సు:28 సంవత్సరాలు, GAD కమాండర్. స్థానిక గూడాచర్య సమాచారం సేకరణ మరియు లాజిస్టిక్స్ బాధ్యతలు నిర్వహించాడు.

7. ముడికం సుక్రం, వయస్సు:25 సంవత్సరాలు, మిలీషియా సభ్యుడు. స్థానిక ప్రాంత కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నాడు.

8. ముడియం మంగు, వయస్సు:50 సంవత్సరాలు, మిలీషియా సభ్యుడు, జంగిల్ కమిటీ.

శ్రీకాంత్ ఒక్కడే తెలంగాణ కి చెందినవాడు, మిగిలిన వాళ్ళందరూ ఛతీస్ ఘడ్ రాష్ట్రం , బీజాపూర్ జిల్లా, గంపుర్ గ్రామం, గాంగేలురు పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారు.

*మీ ఊరికి రండి! మావోయిస్టులకు పోలీస్ వారి ఆహ్వానం!!*

రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ తరుపున, అజ్ఞాతములో ఉన్న మావోయిస్టులను జన జీవన స్రవంతి లోకి రావాలిసినది గా కోరుచున్నాము. తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివృద్దికి తోడ్పడాలని కోరుతున్నాము. అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు మరియు ఇతర సహాయ సహకారాలు అందిస్తుంది. వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి అన్నీవిధాల తోడ్పాటును అందిస్తుంది. లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని హామీ ఇస్తున్నాం. ప్రస్తుత సమాజంలో యువత చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వారు దూరంగా ఉంటున్నారు. మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది. చదువుతున్న వారు ఎవరు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం లేదు.

*అజ్ఞాతం లో ఉన్న అదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లా మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని కోరుతున్నాం.*

*పోరు వద్దు!! – ఊరు ముద్దు!!*

*ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని వీడండి!! – జనజీవన స్రవంతిలో కలవండి!!*

ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్ లు రాజేంద్ర ప్రసాద్, భీమేష్, ఆర్ ఐ శేఖర్, ఆర్ ఎస్ ఐ లు వెంకట్, శివ, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *