ప్రాంతీయం

మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం చట్ట ప్రకారం నేరం

21 Views

మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం చట్ట ప్రకారం నేరం,

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

సిద్దిపేట జిల్లా జనవరి, తెలుగు న్యూస్ 24/7 

కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోడ్ సురక్ష అభియాన్/ రహదారి భద్రత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె ప్రవీణ్ కుమార్,సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల విద్యార్థులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పడం జరిగింది.మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం చట్ట ప్రకారం నేరం,రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి,మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి.విద్యార్థిని విద్యార్థులు నేర్చుకున్న ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి తల్లిదండ్రులకు తెలియపరచాలని సూచించారు.సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మాట్లాడుతూ పోలీస్ కమిషనర్, ఆదేశానుసారం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపవద్దని తెలిపారు. కారణము లేని మరణం ఒక రోడ్డు ప్రమాదం మాత్రమే వాహనదారులు తప్పకుండా రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ఇరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. వేగంగా వెళ్లే వాహనానికి, సాధారణ స్పీడ్ తో వెళ్లే వాహనానికి తేలిక 15 నిమిషాలు మాత్రమే తేడా ఉంటుందని తెలిపారు.మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి సంవత్సరం భద్రత వారోత్సవాలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసుకోవాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దని తెలిపారు.జరిమానా ఫైన్లు వేయడం మా అభిమతం కాదని ప్రమాదాల నివారణ గురించి రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మాత్రమే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన సిగ్నల్స్ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఎలా పాటించాలి అనే అంశంపై ట్రాఫిక్ సిగ్నల్ చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి. సునీత, వైస్ ప్రిన్సిపాల్, ఎన్ సి సి, ఇంచార్జ్ కృష్ణయ్య మరియు కానిస్టేబుల్ అఖిల్, పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *