దుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలోని తెలంగాణ మెడల్ స్కూల్,జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ
జిల్లా కలెక్టర్ కె హైమావతి
సిద్దిపేట జిల్లా, జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7 )
దుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలోని తెలంగాణ మెడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియనుక్షేత్రస్థాయిలో పరిశీలించారు.వంట గదిలో అన్నం, వంకాయ కూర, పప్పు చారు, గుడ్డు వండినట్లుగా వంట సిబ్బంది తెలపగా అన్నింటిని తనికి చేశారు. పప్పు చారు నాణ్యతగా లేదని కూర అందరికీ సరిపోతదా అని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరైన 373 మంది విద్యారులకు సరిపడినంత వండాలి స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేశారు. రోజు వారిగా విద్యార్థుల హాజరు ప్రకారం స్టాక్ రిజిస్టర్ రాయకుండా ఏదో మొక్కుబడిగా రాసినట్లుగా గమనించి ప్రిన్సిపల్ పైన మండిపడ్డారు. విద్యార్థుల పౌష్టికాహారం అందించకుండా మీకు నచ్చిన విధంగా వంట చేసి విద్యార్థులకు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. స్వయంగా విద్యార్థులకు కూర వడ్డించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ కొలత ప్రకారం ప్రతి విద్యార్థికి ఆహారం సరిపోయే విధంగా రుచికరంగా వండాలని ప్రిన్సిపల్ మరియు వంట సిబ్బందిని ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్ సరిగ్గా రాయనందున, ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిపడినంత వండలేదని ప్రిన్సిపల్ బుచ్చిబాబు పై యాక్షన్ తీసుకోవాలని డిఈఓ కీ ఫోన్ ద్వారా ఆదేశించారు.తెలంగాణ మెడల్ స్కూల్ జూనియర్ కళాశాల పక్కన గల ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కామన్ డైట్ మెనూ ప్రకారం వండలేదని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెను ప్రకారం పెట్టకుండా ఏం చేస్తున్నావ్ అంటూ హాస్టల్ వార్డెన్ కవిత పైన మండిపడ్డారు. ఉదయం టిఫిన్ మొదలు కోని రాత్రి భోజనం వరకు ప్రభుత్వం అందించిన మెనూ ప్రకారం వండాలని మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వసతి గృహ ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. కామన్ డైట్ మెనూ పాటించకుండా, ఆహారం నాణ్యతగా లేదని,వంట గది లోపల బయట జిడ్డు జిడ్డుగా ఉన్నందున హాస్టల్ వార్డెన్ నుండి వంట సిబ్బందిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓ కు ఫోన్ ద్వారా ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడారు వసతి గృహంలోని పలు సమస్యల టాయిలెట్స్ క్లీనింగ్, గదులలో మైనర్ రిపేర్లు చేయించాలనీ పలు ఇతరత్ర విషయాలు కలెక్టర్ కి తెలపగా అన్నింటికి సానుకూలంగా స్పందించారు. ఏంఈఓ వస్తాడని మీకు కావలసిన అన్ని నమోదు చేసుకుని అన్ని సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం మండలంలోని రామక్కుపేట గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అటెండెన్స్, ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపికగా మెరుగని వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. రోజు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని రోగులకు సూచించారు.





