ముస్తాబాద్, డిసెంబర్ 15 (24/7న్యూస్ ప్రతినిది) బంధనకల్ గ్రామంలోని మాజీ సర్పంచ్ జెల్లా వెంకటస్వామి సతీమణి సరస్వతి మాట్లాడుతూ గతంలో మాభర్త సర్పంచిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆయనతో తోడుండి అభివృద్ధి వెంబడ నేనున్నాను. నాటి అనుభవం ఇంకా

మరువక ముందే నాకు ఈ అవకాశం వచ్చింది అదే కోవలో అభివృద్ధి చేస్తాను. నాడు అభివృద్ధి చెప్పుకుంటూపోతే శ్మశానవాటిక, బోర్లు బావులు, గ్రామ వీధుల్లో సిసిరోడ్లు, మెయిన్ రోడ్ బస్టాండ్ వరకు సుమారుగా150 పైచిలుకు విద్యుత్ స్తంభాలు, ముస్లింలకు కబ్రస్థాన్, విద్యను అభ్యసించడానికి అదనపు గదులు, ప్రహరీ గోడ, పల్లె దవాఖాన, రేగుల చెరువులో కాంక్రీట్ గాజులు, వ్యవసాయ ఎరువుల గిడ్డంగిగోదాం, పెద్దట్యాంక్ లు, మినీ ట్యాంక్ లు, బంజేరుపల్లి, ఇబ్రహీంపూర్, మొర్రాపూర్ అన్ని కనెక్టింగ్ రోడ్లు, రోడ్లకు ఇరువైపుల చెట్లు, ఊరిలో రోడ్డుకి పక్కన మోరీలు, అనేకమంది నిరుద్యోగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఊరి చెరువు దగ్గర మత్తడి, విశ్రాంతిపార్కు మరియు చెరువు కట్టకు మెట్లు, ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ కి ఎగ్జామ్ కిట్లు, హై స్కూల్ కి, ప్రైమరీ స్కూల్ కి రెండు వంటగదుల నిర్మాణం ఇంకా మరెన్నో ఉన్నాయని తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి పనులను పరిశీలనచేసి మీ అమూల్యమైన ఓటు ద్వారా కత్తెర గుర్తుకు ఓటువేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ నాగ్రామ ప్రజలను పేరుపేరునా వేడుకుంటున్నానని

తెలిపారు.




