ప్రాంతీయం

జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం – టిడబ్ల్యూజేఎఫ్

48 Views

జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం -టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్ యాదవ్.

మంచిర్యాల జిల్లా.

నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై కథనాలు రాస్తున్న జర్నలిస్టులపై దాడులు నానాటికి పెరిగిపోతున్నాయని జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య అని మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్, చింతకింది మధుసూదన్ లు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వార్తలు ప్రచురించినందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు బి9 న్యూస్ కార్యాలయం పై దాడులు అప్రజా సామికమని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవో రాజేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టులపై దాడులు అప్రజ స్వామికమని హేయమైన చర్యని బి9 న్యూస్ కార్యాలయం పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రత కొరకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ముత్యం వెంకటస్వామి, జిల్లాఉపాధ్యక్షులు సమ్మయ్య, నాయకులు ఓదెలు, రాజ్ కుమార్, శ్రీధర్, సత్యం, మహేందర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *