ప్రాంతీయం

కోతుల బెడద లేకుండా చేసే వరకే మా ఓటు – పాములపర్తి మహిళలు

127 Views

మర్కుక్ మండల వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల కోలాహలం

ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ 

కోతుల బెడద లేకుండా చేసే వరకే మా ఓటు – పాములపర్తి మహిళలు

సిద్దిపేట జిల్లా,మార్కుక్, నవంబర్ 27

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం లో ఎన్నికల కోలాహలం మొదలైంది సర్పంచ్ వార్డ్ సభ్యుల ఎన్నికలకు అన్ని సిద్ధం చేసిన అధికారులు మండలంలో 16 గ్రామ పంచాయతీ లకు 4 క్లస్టర్స్ ఏర్పాటు చేశారు.మర్కుక్ ,పాముల పర్తి ,ఎర్రవల్లి

దామర కుంట గ్రామాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు, మొదటిరోజు నామమాత్రంగా దాఖలైన నామినేషన్లు, కాగా పాములపర్తి గ్రామంలో మహిళలు మాట్లాడుతూ మా గ్రామంలో కోతులు,కుక్కలు ఎక్కువగా ఉన్నాయి, చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని కోతులు పంట పొలాల్లో, చేతికి వచ్చిన ధాన్యం రాశులను చిందర వందర చేస్తూ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయని, వాటి బారిన పడి ఎంతోమంది గాయాల పాలయ్యారని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు, కుక్కలు, కోతుల బెడద లేకుండా చేసిన వారికే మా ఓటు అని,మాకు డబ్బు,మద్యం,వద్దు అని అన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *