ప్రాంతీయం

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి మూర్తి రాజేందర్ రెడ్డి దంపతులు విరాళం

50 Views

దుబ్బాక పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి చేర్వపూర్ వార్డుకు చెందిన మూర్తి రాజేందర్ రెడ్డి దంపతులు 1,25,000/- రూపాయలను అయ్యప్ప ఆలయ చైర్మన్ చింత రాజు గుప్తకు అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సంపాదించిన దాంట్లో ఎంతోకొంత ఆలయాల నిర్మాణాలకు సహకారం చేసినప్పుడే మానవ జీవితానికి సార్ధకత ఉంటుందన్నారు. జన్మనిచ్చిన గడ్డపైన శ్రీధర్మశాస్త్ర ఆలయాన్ని నిర్మించడం అందులో తాను పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృత ఫలమన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మూర్తి రాజేందర్ రెడ్డి 2500 స్క్వేర్ ఫీట్ల గ్రానైట్ ను ఆలయానికి అందించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజేందర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని వీరి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *