అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేర్యాలలో వివిధ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది
సిద్దిపేట జిల్లా, చేర్యాల అక్టోబర్ 14
చేర్యాల అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలో వివిధ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గౌతమి జూనియర్ కళాశాలలో సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్ ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిలభారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ప్రతి సంవత్సరం విద్యార్థుల నుండి సభ్యత్వ నమోదును చేస్తుందని ఈ సభ్యత్వ నమోదు ద్వారా విద్యార్థి ఉద్యమాలను విద్యార్థులకు చేరవేయడమే మా లక్ష్యం అని అదే విధంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్య వ్యతిరేక విధానాల విద్యార్థులకు తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులను సంఘటితం చేయడమే మా ఏఐఎస్ఎఫ్ లక్ష్యమని తెలియజేశారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్న మాకు తెలియజేయాలని ఆ సమస్యలను పరిష్కరించడం కోసం విద్యార్థి సంఘంగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేశారు అదేవిధంగా విద్యార్థులు డ్రగ్స్ ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని వారు అన్నారు ఒకవేళ ర్యాగింగ్ ఇవిటీజింగ్ లేదా ఇంకా ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడం కోసం విద్యార్థులు క్రమశిక్షణ చదువుకొని ముందుకు సాగాలని తెలియజేశారు విద్యార్థి సంఘం నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో చేర్యాల మండల కార్యదర్శి ఎస్కే యాసిన్, మండల సహాయ కార్యదర్శి పోతుగంటి ప్రశాంత్, మండల ఉపాధ్యక్షులు గీరిక అభినయ్ శ్రీరామ్, పత్తి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు





