42% బీసీ రిజర్వేషన్ అమలకై అర్ధ నగ్న ప్రదర్శన.
మంచిర్యాల జిల్లా.
ఈరోజు మంచిర్యాల్ పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లను హైకోర్టు స్టే విధించడానికి నిరసిస్తూ అర్థనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించింది అందులో భాగంగా 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ తీరా హైకోర్టుకు వెళ్లి అబస్పాలైన సందర్భం బీసీలను మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి రావడానికి మాత్రమే అని భావిస్తున్నాం కాంగ్రెస్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ పై ఒత్తిడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి 50 సార్లు వెళ్లినప్పటికీ ఏ ఒకసారి కూడా బీసీ అంశాన్ని ప్రధానీ దృష్టికి కావచ్చు కేంద్ర మంత్రులు దృష్టికి కావచ్చు తీసుకువెళ్లిన సందర్భం లేదు అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో అఖిలపక్షంగా తీసుకెళ్లి ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం బీసీ పక్షపాతి అని చెప్పుకుంటున్న బిజెపి ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఏనాడు బీసీలకు రిజర్వేషన్లపై పార్లమెంటులో లేవనెత్తిన సందర్భం లేదు అంటే బిజెపి కూడా బీసీల వ్యతిరేక పార్టీనే కానీ మేము రిజర్వేషన్లకు మద్దతు అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు ఏనాడు రిజర్వేషన్లపై ఈ రెండు పార్టీలు అలాగే టిఆర్ఎస్ పార్టీ కూడా 42% రిజర్వేషన్లపై ఆందోళనలు చేయలేదు కానీ చేయవలసిన బాధ్యత ఈ పార్టీలపై ఉన్నది బీసీల సంఘాలుగా ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి అలాగే రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వచ్చేటువంటి ఉద్యమాలు చేసి 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, గజ్జెల్లి వెంకటయ్య, వేముల అశోక్, చెలిమెల అంజయ్య, రాగి రాజేష్ ,నిన్నెలా నర్సయ్యా ,చంద్రగిరి చంద్రమౌళి, పంపరి వేణుగోపాల్,కీర్తి బిక్షపతి, అంకం సతీష్ ,జంబో శ్రీనివాస్, వడ్డే రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.





