గుంతలు పూడ్చిన గ్రామస్తులు. ఆర్ అండ్ బి రోడ్డుపై గుంతలను పూడ్చిన అక్కపల్లి గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాలకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డుపై రాపెల్లి వాగు దగ్గర అక్క పెళ్లి గ్రామస్తులు ఆదివారం గుంతలను పూడ్చి శ్రమదానం చేశారు. రాపెల్లి వాగుపై కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఇరువైపులా మట్టి రోడ్డును వదిలేయడం జరిగింది. దీనితో గుంతలుగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని గమనించిన అక్కపల్లి గ్రామస్తులు ముందుకు వచ్చి ట్రాక్టర్ ఫ్రంట్ బ్లేడ్ బండితో గుంతలు పూడ్చివేసి ఇరువైపులా చదును చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులతో వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వానికి ఆర్ అండ్ బి ఈ ఈ ద్వారా నివేదికను తయారు చేయించి శాశ్వత పనులు అయ్యే విధంగా బాధ్యత తీసుకుంటామని అన్నారు ఈ మేరకు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి బ్రిడ్జికి ఇరువైపులా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించిన వారిలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, దుమాల మాజీ సర్పంచ్ కదిరె శ్రీనివాస్ గౌడ్, నాయకులు చెన్ని బాబు, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, మెండే శ్రీనివాస్ అక్కపల్లి గ్రామానికి చెందిన మాదాసు బాబు, జంగా భూమి రెడ్డి, రాజు యాదవ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.





