*అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత మిస్టర్ ఫ్రైస్ జట్టు*
భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా డిసెంబర్ 25 న రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభం అయిన అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ 7 వ ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు మంచిర్యాల పట్టణంలోని శివాజీ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీశ్ బాబు మరియు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజరై ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించడం జరిగింది. అనంతరం ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన మిస్టర్ ఫ్రైస్ జట్టు క్రీడాకారులకు విన్నర్ ట్రోఫీ మరియు 15 వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ అందజేయడం జరిగింది. రన్నర్ గా నిలిచిన సతీష్ స్మాషర్స్ జట్టుకు రన్నర్ ట్రోఫీ మరియు 7500 రూపాయల క్యాష్ ప్రైజ్ క్రీడాకారులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా యువతను క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తుంది అని తెలిపారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న 64 జట్లు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రం క్రీడాకారులకు అడ్డ అని తెలిపారు. మంచిర్యాల జిల్లా యువత చాలా క్రీడా నైపుణ్యం ఉందని వారిని క్రీడల్లో ప్రోత్సహించడానికి ప్రతి క్రికెట్ మరియు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో యువత కోసం వివిధ క్రీడల్లో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వంగపల్లి వెంకటేశ్వర రావు, రజనీష్ జైన్, దుర్గం అశోక్, గాజుల ముఖేష్ గౌడ్, ఎనగందుల కృష్ణ మూర్తి, రమణ రావు,మోటపలుకుల తిరుపతి, సత్రం రమేష్, గడ్డం స్వామి రెడ్డి, సంజీవ్, బెల్లంకొండ మురళి, జయరామ రావు, ముదాం మల్లేష్, రాకేష్ రెన్వా, రెడ్డిమళ్ల అశోక్, కర్రె చక్రి, బింగి సత్యనారాయణ, చిరంజీవి మరియు తదితరులు పాల్గొన్నారు.
