మంచిర్యాల జిల్లా, లక్షేట్టిపేట.
నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(NIF) మరియు జిల్లా పాఠశాల విద్యాశాఖ మంచిర్యాల వారు రెండు రోజులు 30 , 1 వ తేదీ లో మంచిర్యాలలో నిర్వహించిన ఇన్స్పైర్ మనక్ 2023- 24 గాను మదర్ థెరిస్సా హై స్కూల్ విద్యార్థి అయిన జింజిపెల్లి అనుదీప్ రాష్ట్ర స్థాయికి ఎంపికవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనకు గాను మరొక విద్యార్థి అయిన ఆకారపు సుశ్విక్ సాయి వేస్ట్ మేనేజ్మెంట్ థీమ్ కు గాను రెండవ బహుమతి పొందాడు. దీనికి గైడ్ టీచర్లుగా రాచర్ల సునితవాణి మరియు అక్కల దేవేంద్ర వ్యవహరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను మరియు గైడ్గా వ్యవహరించిన టీచర్లను మదర్ థెరిస్సా హై స్కూల్ లక్షేట్టిపేట్ వారు అభినందించారు. ఈ విషయం లో పాఠశాల యాజమాన్యం ఫాదర్ అనూప్ జార్జ్ , ఫాదర్ షైన్ మరియు ఫాదర్ ఎవరో లింటో ఎంతో సహకరించారు మరియు సంతోషం వ్యక్తం చేసి విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మదర్ థెరిస్సా హై స్కూల్ టీచర్లు ప్రిన్సిపల్ మరియు విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





