మంచిర్యాల జిల్లా
*మంచిర్యాల ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి లేదంటే డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి *
*నిన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బిజెపి నాయకుల పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న భూ ఆక్రమణల పై మరియు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారీంటీల విఫలం అవ్వడం పై ఈరోజు బిజెపి జిల్లా కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.*
ఈ సందర్భగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలు మానుకోవాలిని ప్రతి పక్ష నాయకుల పై కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతోతే డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని పిలుపినిచ్చారు. ఈ విషయం పై మఖ్యమంత్రి గారు మరుయు పోలీస్ ఉన్నతాధికారులు ఎమ్మెల్యే బెదిరంపులు పై దృష్టి పెట్టాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో భూ కబ్జాదారులే భూ ఆక్రమణల పై మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉందని మంచిర్యాలలో భూ దందా మరియు సెటిల్మెంట్లు చేస్తుందని ఎవరనేది ప్రజలందరికీ తెలుసుని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హైదరాబాద కాప్రా లో పేదల భూములు కబ్జా చేశారని ఆ బాధితుల చేస్తున్న ఆరోపణల పై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారా. హైదరాబాద్ లో చెరువుల్లో, బఫర్ జోన్ లో ఇండ్లు కట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఫీటీఎల్ మరియు బఫర్ జోన్ లో ఉన్న భూ ఆక్రమణల జాబితా తెప్పించుకొని ముందుగా భూ అక్రమణలు చేసిన కాంగ్రెస్ నాయకుల ఇండ్లు కులగొట్టాలని డిమాండ్ చేశారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అప్పుడు భూ ఖబ్జాలు, మరియు అక్రమ పెన్షన్ లు పొందిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరగానే నీతిమంతులు అయ్యారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధికారంలో ఉన్నాం కదా అని ప్రతి పక్ష పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తూ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే కి న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదని ఒక్క వ్యక్తి దోషి లేదా నిర్దోషి అని న్యాయమూర్తి చెప్పక ముందే ఎమ్మెల్యే అరెస్ట్ అయిన వారి పై దోషి అని ముద్ర వేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. ఇతర పార్టీల నాయకుల పై పీడీ యాక్ట్ పెడతాం అని రౌడీ షీట ఓపెన్ చస్తామని ఎమ్మెల్యే బహిరంగంగా చెప్తుంటే అసలు పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట లేనట్టా అని ప్రశ్నించారు. పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులలు వత్తాసు పలకకుండా బాధితుల పక్షాన నిలబడాలని హితువుపలికారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అదే విధంగా మంచిర్యాల ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అవ్వడంతో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు అనే ఉద్దేశంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఇంకోసారి ఎమ్మెల్యే మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజెపి కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఇలాంటి బెదరింపు రాజకీయాలకు పాల్పడితే డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, వంగపల్లి వెంకటేశ్వర రావు, మోటపలుకుల తిరుపతి, గాదె శ్రీనివాస్, కర్రే లచన్న, పూదారి రామ్ చందర్, ముదాం మల్లేష్, అమీరిశెట్టి రాజు,బొలిశెట్టి అశ్విన్, గాజుల ప్రభాకర్, కంకణాల సతీష్, కాశెట్టి నాగేశ్వర్ రావు, ఈర్ల సదానానందం, మధు రెన్వా, సదానందం, బింగి సత్యనారాయణ, బల్ల రవి, అర్ణకొండ శ్రీనివాస్, దేవరకొండ వెంకన్న, చిరంజీవి, తరుణ్ మరియు తతిదరులు పాల్గొన్నారు.
