గురు పూజత్సవం సందర్బంగా సిద్దిపేటలో ట్రస్మా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయలకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన ప్రగతి స్కూల్ ప్రిన్సిపాల్ రెహమత్ కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మరియు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారికీ అభినందనలు తెలిపారు. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుని మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి స్కూల్ విద్యాసంస్థల చైర్మన్ అంబదాస్ పాల్గొన్నారు.




