*▪️ఎస్సీ వర్గీకరణ తీర్పును నిరసిస్తూ ఈ నెల 11న కోట పట్టణంలో ప్రతిఘటన నిరసన ర్యాలీ..*
*▪️ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి…*
*▪️ఉదయం 9 గంటలకు కోట క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభం కానున్న ర్యాలీ..*
*▪️రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సమీక్షించి రద్దు చేయాలనేదే, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి లక్ష్యం…*
*✍️BCN NEWS✍️* ఎస్సీ వర్గీకరణ తీర్పును నిరసిస్తూ ఈనెల 11వ తేదీన ఉదయం 9 గంటలకు తిరుపతి జిల్లా, కోట పట్టణంలో వేలమంది దళితలతో జరగనున్న ప్రతిఘటన నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పిలుపునిచ్చారు.. కోట పట్టణంలోని సిద్దార్ధ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా నిరసన ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆ కమిటీ సభ్యులు దాసరి సుందరం, పంట్రంగం వసంత్ కుమార్ మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రేరణతో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు అనే సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాలు కేంద్రంగా ఆవిర్భవించిన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నిరసనకు పిలుపు నివ్వడం జరిగిందన్నారు. కోట క్రాస్ రోడ్డు వద్ద నుంచి మొదలుకానున్న ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగుతుందని చెప్పారు.. రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సమీక్షించి రద్దు చేయాలనేదే లక్ష్యంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న బీఎస్పీ అధినేత బెహేన్ జీ మాయావతి, లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వాన్ , భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ తోపాటు పలు ఎస్సీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు.. కావున అంబేడ్కర్ వాదులు, ప్రజాస్వామికవాదులు, వర్గీకరణ వ్యతిరేక నిరసన ర్యాలీలో పాలుపంచుకోవలని ఈ సందర్భంగా వారు కోరారు.. ఈ కార్యక్రమంలో అశోక్ కాంబ్లే, మీజూరు మాధవ్, పనబాక హేమంత్, రంగనాథ్, కేశవ, కృష్ణయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.





