(తిమ్మాపూర్ జూలై 13)
అనుమతులకు మించి అక్రమంగా మోయతుమ్మెద వాగులో నుండి ఇసుక తవ్వకాలు చేసి లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపిస్తూ రేణికుంట వాగులో నిరసనకు దిగారు గామస్తులు..
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట వాగులో ఇటీవల ప్రభుత్వ అనుమతులతో ఇసుక తవ్వకాల విషయంలో టెండర్ వేయగా అనుమతుల ప్రకారం ఇప్పటికే సదరు కాంట్రాక్టర్ ఇసుక తవ్వకాలు జరిపి డంపింగ్ చేసిన ఇసుకను వివిధ ప్రాంతాలకు తరలించారు..
కొద్దిరోజుల క్రితం టెండర్ సమయం మిగిసిన కాంట్రాక్టర్ మాత్రం ఎదవిడిగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి లక్షల సొమ్ము కుడబెట్టుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అసలే వర్షాలు పడక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరిపితే భూగర్భ జలాలు అడుగంటిపోయి పోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు చెబుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.