కాంగ్రెస్ పార్టీ వికలాంగులా విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సింగిరాల రాజు నియామకం
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 13)
సిద్దిపేట జిల్లా:
కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చిన్నకోడూరు మండలం చెర్లంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింగిరాల రాజు నియామించినట్లు నియామకపత్రాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతులమీదుగా అందజేశారు .ఈ నియామక పత్రాన్ని వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు ముత్తినేని విరయ్య జారీ చేసారు .ఈ సందర్బంగా ఎన్నికైన సింగిరాల రాజు మాట్లాడుతూ నా పై నమ్మకంతో నాకు ఈ పదవీ రావటానికి సహాకరించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పూజల హరి కృష్ణ,డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్,చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ ఆధ్వర్యంలో చిన్నకోడూరు మండల కేంద్రం లో గజ మాల తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా పాల్గొన్నటువంటి డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ మాట్లాడుతు పార్టీ ఎదుగుదల కోసం కంకణ బద్దులై పనిచేసిన ప్రతి కార్యకర్తకు సరైన సమయం లో పార్టీ అధిష్టానం గుర్తింపునిస్తుందాన్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైనటువంటి సింగిరాల రాజు ను శాలువా కప్పి గజమాల తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మండలం పార్టీ ఉప అధ్యక్షులు సందబోయిన పర్షరం, సెక్రటరీ కోరిమి రాజు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల రాజేష్, యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్, ప్రధాన కార్యదర్శి బర్ల స్వామి, పిషర్మెన్ జిల్లా కార్యదర్శి గుండు వెం కట్,ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు దుగ్యని వెంకటేష్, నక్క రాజు, తాళ్ల రాజు, మందపల్లి సంపత్ ఎస్సీ సెల్ మాజీ మండల అధ్యక్షులు నముండ్ల వినోద్,సీనియర్ నాయకులు పుచ్చాకాయల వెంకటరెడ్డి నాయకులు చిక్కుడు అనిల్, బైరోజ్ రమేష్,తదితరులు పాల్గొన్నారు.
