రాజకీయం

మర్కుక్ మండలంలో వివిధ వ్యాపారస్తులు కమిటీ ఏర్పాటు

83 Views

మర్కుక్ మండలంలో వివిధ వ్యాపారస్తులు కమిటీ ఏర్పాటు

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి, (జులై 13)

సిద్దిపేట జిల్లా,మర్కుక్ మండలంలో వివిధ వ్యాపారుల యాజమాన్యం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. చిరు వ్యాపారుల సముదాయంలో షాప్స్ అసోసియేషన్ మండలి ఏర్పాటు చేయగా పాములపర్తి గ్రామానికి చెందిన ఉప్పరిమైపాల్ ని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడు ఉప్పరి మైపాల్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న దుకాణాల యాజమాన్యానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కొనియాడారు అదే విధంగా తమకు ఎటువంటి ఆపద వచ్చిన సకాలంలో పరిష్కరిస్తానని తమ వంతు సహాయాన్ని కూడా చేస్తానని హామీ ఇచ్చాడు.
ఈ కార్యక్రమంలో వివిధ దుకాణాల షాప్స్ యజమానులు, రాళ్ల బండి ఆంజనేయులు,
మర్క నాగరాజు, చేబర్తి రాజు, స్టూడియో నరసింహులు, లింగని బిక్షపతి,
దుబ్బాసి బాలకృష్ణ, రాజు, బత్తిని ప్రభాకర్, పాల్గొనడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్