ముత్యాల తలంబ్రాలు అందుకున్న మర్కుక్ ఎస్.ఐ
అద్భుత కార్యక్రమం అని రామకోటి రామరాజును సన్మానించిన
ఎస్. ఐ మధుకర్ రెడ్డి
సిద్దిపేట్ జిల్లా మర్కుక్ జూన్ 25
సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచలం దేవస్థాన కళ్యాణ ముత్యాల తలంబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం నాడు మర్కుక్ ఎస్ ఐ మధుకర్ రెడ్డితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ బృందానికి అందజేశారు.
ఈ సందర్బంగా ఎస్ ఐ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ముత్యాల తలంబ్రాలు అందుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భద్రాచలం నుండి తీసుకొచ్చి మాకు అందజేయడం మమ్మల్ని కూడా శ్రీరాముని సేవలో తరించే భాగ్యాన్ని కలగజేసిన రామకోటి రామరాజు ధన్యుడన్నాడు. మరెన్నో అద్భుత కార్యక్రమాలు నిర్వహించాలని రామకోటి రామరాజును శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఎస్ ఐ మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
