రాజకీయం

కుకునూరు పల్లి మండలం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులుగా గౌటీ సంపత్ ఏకగ్రీవంగా ఎన్నిక

119 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
గజ్వేల్ (ఏప్రిల్ 20)

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని యస్ ఎల్ యన్ కన్వెన్షన్ హాల్ లో బి ఆర్ యస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా బి ఆర్ యస్ పార్టీ యూత్ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో కుకునూరుపల్లి మండల బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులుగా కుకునూరు పల్లికి చెందిన గౌటీ సంపత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .శనివారం ప్రజ్ఞాపూర్ లో జరిగిన కార్యక్రమంలో ఎఫ్ డి సి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి,మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి లతో కలిసి జిల్లా బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నాగ రాజు గౌటీ సంపత్ కు నియామకపత్రాన్నిఅందజేశారు. ఈ సందర్భంగా గౌటి సంపత్ మాట్లాడుతూ తనకు పదవి ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.పార్టీ ప్రతిష్టతకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పలువురు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్