Breaking News

గోటి తలంబ్రాలను అందించనున్న రామకోటి సంస్థ

108 Views

గజ్వేల్ లో జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కల్యాణానికి

గోటి తలంబ్రాలను అందించనున్న రామకోటి సంస్థ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ / ఏప్రిల్ 20

గజ్వేల్ లో జరిగే సీతారామ ఉమామహేశ్వర కల్యాణంలో ఈ సంవత్సరం గోటి తలంబ్రాలను అందించాలనే భక్తుల కోరిక మేరకు గోటి తలంబ్రాల దీక్షకు శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కల్యాణానికి మన సంస్థ నుండి 150కిలోల గోటి తలంబ్రాలు అందించమన్నారు. అదే విధంగా మన గజ్వేల్ లో మే 2తేదీన జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కల్యాణానికి కూడా గోటి తలంబ్రాలను అందించాలననే లక్ష్యంతొ భద్రాచలం నుండి 20కిలోల వడ్లు తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొంటారన్నారు. అన్ని దేవాలయాల్లో సామూహికంగా రామనామ స్మరణ చేపిస్తూ తలాంబ్రాలుగా తయారు చేపిస్తానని రామకోటి రామరాజు తెలిపారు.

నేటి నుండి గోటి తలంబ్రాల దీక్షకు శ్రీకారం చుట్టామన్నారు. రామకోటి కార్యాలయంలో భక్తులందరికి గోటి తలంబ్రాలు (వడ్లు) అందుబాటులో ఉంచామన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్ధి బిక్షపతి, నంగునూరి సత్యనారాయణ, దూబకుంట మెట్రములు, దూబకుంట ప్రభాకర్, దూబకుంట గాలయ్యా, జగ్గారి శేఖర్ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298