ప్రాంతీయం

రైతులపై కపట ప్రేమ చూపిస్తున్న టిఆర్ఎస్

74 Views

రైతులపై కపట ప్రేమ చూపించి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బిఆర్ఎస్ నేతలపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పంట పొలాల బాట బాటపై ఘాటుగా స్పందించారు. గత పది సంవత్సరాల కాలంలో రైతులను దోచుకున్నది బిఆర్ఎస్ పార్టీ నేతలే అని ఆయన విమర్శించారు. రైతులు పండించిన పంటను కొనుగోళ్ల పేరుతో లూటీ చేసింది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కదా ఆనీ అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారనీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడంతోనే రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఐకెపిల ద్వారానే రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. ఎవరైనా తూకం పేరుతో రైతుల కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా కరువు లేదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ స్థాపించుకున్న బిఆర్ఎస్ పార్టీలోనే కరువు ఏర్పడిందనీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి నిర్మాణం అసంఖ్యాకంగా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో సింగిల్ వే బ్రిడ్జి నిర్మించలేం, అందుకే ముల్కల పరిసర ప్రాంతంలో గోదావరి నదిపై నాలుగు వరసల రహదారి బ్రిడ్జిని నిర్మిస్తామని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తన సొంత 30 ఎకరాల భూముల ప్రయోజనాల కోసమే పదేపదే ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం మాట్లాడుతున్నారనీ, ఎక్కడ తమ భూములు కోల్పోకుండా ఉంటామోననీ బాధపడుతున్నాడనీ ఆయన విమర్శించారు. మంచిర్యాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 12 స్థానాలను కైవసం చేసుకుంటుందని అన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జిల్లా నాయకులు, మంచిర్యాల, నస్పుర్ మున్సిపాలిటీల పాలకవర్గం సభ్యులు, పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్