Breaking News

రుణమాఫీ చేయాలి

192 Views

రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి భారతీయ జనతా పార్టీ మర్కుక్

మార్చి 30

భారతీయ జనతా పార్టీ మర్కుక్ మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 2లక్షల రుణమాఫీ వెంటనే హామలు చేయాలన్నారు. రైతులు రుణం కట్టకపోవడంతో గజ్వేల్ నియోజకవర్గంలో బ్యాంకు అధికారులు వారి ఇంటి చుట్టూ తిరుగుతూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ రుణం వెంటనే కట్టకపోతే  ఇండ్లకు తాళాలు వేస్తామని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.

రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సూచన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా రైతులు రైతు రుణం తీసుకొని వారు ఉంటే వెంటనే వెళ్లి బ్యాంకులో రుణం 2 లక్షల రూపాయల వరకు తెచ్చుకోవాలని తమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే రెండు లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేస్తామని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం

అమాయకమైనటువంటి నిరుద్యోగులను ఉద్యోగస్తులను రైతులను అడ్డం పెట్టుకొని మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది అన్నారు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అదే కోవలో ప్రయాణిస్తూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అమాయకమైనటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని సైతం మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా రైతు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతులను సైతం మాయలపకీరు మాటలతో నమ్మించి రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్న ఇంతవరకు మాట నెరవేర్చుకోలేదని ఎద్దేవా చేశారు.

దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ దేవుడెరుగు కానీ రైతులు పండించినటువంటి పంట కాపాడుకోవడానికి పంటలు పూర్తిగా పండించడానికి కూడా సరైన విధంగా కరెంటు కొరత చాలా తీవ్రంగా ఏర్పడదని వాపోయారు గజ్వేల్ నియోజకవర్గంలో పంట పొలాలు కరెంటు లేకపోవడంతో పూర్తిగా ఎండిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగుల విషయంలో గానే రైతుల విషయంలో గాని ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని మర్కుక్ మండల నుండి పిలుపునివ్వడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్