మంచిర్యాల – అంతర్గం మధ్య గోదావరి పై వంతెన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు విఫలం చెదటం మరియు 18 న జగిత్యాల లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ విజయవంతం చేయడం పై ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలో వచ్చిన 100ల్లో అమలు చేస్తామని చెప్పి 100 రోజులు దాటినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ అని అన్నారు. 6 గ్యరెంటీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా, 2 లక్షల రుణ మాఫీ, మహిళలకు 2500 రూపాయలు మరియు నిరుద్యోగులకు 4 వేల రూపాయల నిరుద్యగ భృతి ఎక్కడ అని ప్రశ్నించారు. అమలుకు నోచుకోని దొంగ హామీలు ఇచ్చి పేద ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా 100 రోజుల్లో చేసిది ఏమి లేదని అన్నారు. కేవలం టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కొని క్యాంప్ రాజకీయాలు చేశారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ది పనులు మొదలు పెట్టలేదని అన్నారు. మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి పై గత ప్రభుత్వం బ్రిడ్జి నిర్మిస్తామని 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికల సమయంలో కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టాక కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిషన్ ల కోసం ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేసి బ్రిడ్జి నిర్మాణం జరగకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు అని అన్నారు. కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి అభివృద్ది పనులను చేపట్టడం లేదని అన్నారు. గోదావరి పై వంతెన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో వచ్చేది బీజేపీ పార్టీ మాత్రమే అని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరొకసారి బీజేపీ పార్టీ 400 పైగా సీట్లను గెలుస్తాయని పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయం అని అన్నారు.
ఈనెల 18 న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పాల్గొననున్న సభలో జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, రెకందర్ వాణి, బోద్దున మల్లేష్, జొగుల శ్రీదేవి, పట్టి వెంకట కృష్ణ, వీరమాల్ల హారి గోపాల్, బొప్పు కిషన్, అమిరిషెట్టి రాజు, బోయిని హారి కృష్ణ, రాకేష్ రేన్వా, రెడ్డిమల్ల అశోక్, కుర్రే చక్రి మరియు తదితరులు పాల్గొన్నారు
