Breaking News

పేకాటరాయుళ్ల అరెస్ట్

481 Views

ఎల్లారెడ్డిపేట మండలం మార్చ్ 14 గురువారం రోజున మధ్యాహ్న సమయంలో ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కు వచ్చిన నమ్మదగిన సమాచారంపై ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశవ పెరుమల గుట్ట ప్రాంతంలో కొందరు జూదమాడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా ఎస్ఐ రమాకాంత్ తన సిబ్బందితో యుక్తంగా పైన అధికారులఫ ఉత్తర్వుల మేరకు ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశపెరమళ్ళ గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ ఏడుగురు వ్యక్తులు జూదం ఆడుతూ ఉండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి నగదు 20,080 రూపాయలు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఏడు సెల్ ఫోన్లు, జూద సామాగ్రిని స్వాధీనం చేసుకొని వారిని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలపడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల శివారులో ఎవరు జూదం ఆడిన అట్టి జూదం వివరాలు తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడునని ఎస్ఐ తెలపడం జరిగింది. ఈ తనిఖీలలో ఎల్లారెడ్డిపేట హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య ,పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ,దిలీప్, బాబయ్య, రాజేందర్ లు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found