మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 18 :
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య సోదరుడు ఏలూరి వెంకట్ ఆనారోగ్యంతో ఇటీవల మరణించారు,
వెంకట్ అనారోగ్య పరిస్థితి గురించి రాజయ్య ను అడిగి తెలుసుకున్నారు
ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు,
రాజయ్య ను పరామర్శించిన వారి లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిర్ల లింగం గౌడ్, బండారి బాల్ రెడ్డి, గుండాడి రాంరెడ్డి , గంట బుచ్చాగౌడ్, బొప్పాపూర్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు,
