24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11)
సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందనీ సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు హరీష్ రావు చెక్కులను అందించారు.





