ఆధ్యాత్మికం

జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య అధికారులతో సమావేశం

202 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఫిబ్రవరి 07: జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య- ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని ప్రాథమిక కేంద్రాల వైద్యాధికారులు మరియు లెప్రాసి నోడల్ పర్సన్స్ హాజరు అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 34 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. కుష్టు వ్యాధి ప్రారంభంలోనే చికిత్సచేస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని జిల్లా ప్రోగ్రాం అధికారి డా. రజిత వివరించారు. ఈ కార్యక్రమమంలో డి పి ఎం ఓ చెపూరి శ్రీనివాస్, రేవూరి కాశీనాథం, కూన సురేష్, రెబెల్లి శ్రీనివాస స్వామి మరియు వైద్యాధికారులు, నోడల్ సూపర్వైజర్స్ హెచ్ ఈ బాలయ్య సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *