Breaking News

ఏబీవీపీ నిరసన

263 Views

కళాశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నిరసన

సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 3

ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు లేవని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ ” సిద్దిపేట జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలోని విద్యార్థులు కనీస మౌలిక వసతులు కరువయ్యాయి, మొన్న జరిగినటువంటి సెమిస్టర్ లో అవకతవకలు జరిగాయని అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదు అదే విధంగా రీవాల్యుయేషన్ రుసుము చెల్లించే సమయంలో అధిక రుసుమును కట్టించుకుంటున్నటువంటి వైనాన్ని ఈరోజు అఖిలభారతి విద్యార్థి పరిషత్ ఖండించడం జరుగుతా ఉంది.

అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. కళాశాలలో సరైనటువంటి రక్షణ వ్యవస్థ లేని కారణంగా బయట నుండి అనేకమంది కళాశాల విద్యార్థులు ఇబ్బంది గురి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మానిస్తాం”అని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ కన్వీనర్ చరణ్,నగర కార్యదర్శి హరీష్,కళాశాల కార్యదర్శి పర్షారాం,కౌశిక్, మంగేశ్,సంతోష్, స్వప్న, శ్రుతి, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గోన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *