Breaking News

అంగన్వాడి కేంద్రం ప్రారంభం

224 Views

ఎర్రవల్లి యూపీఎస్ పాఠశాల అంగన్వాడి కేంద్రం ని ప్రారంభోత్సవం చేసిన ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం

జనవరి 8

సిద్దిపేట జిల్లా మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఇంతకుముందు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని యూపీఎస్ ఎర్రవల్లి పాఠశాలలో  ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, స్థానిక సర్పంచ్ తో కలిసి ప్రారంభించారు .

అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ చిన్నపిల్లలకు ఆట వస్తువులు, కుర్చోవడానికి కుర్చీలు , టేబుల్స్ దాతల సహకారంతో సుమారు మూడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేయించిన సర్పంచ్ భాగ్య బిక్షపతి ని అభినందించారు.

మండలంలోనే ఎర్రవల్లి అంగన్వాడి కేంద్రం మోడల్ గా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యుపిఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు సంధ్యారాణి,అంగన్వాడి టీచర్ నాగలక్ష్మి, ఆయమ్మ ఎల్లమ్మ, వార్డు సభ్యులు శేఖర్, భాగ్య శ్రీశైలం, సుజాత యాదగిరి, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులుప్రభాకర్ రెడ్డి,కొమురయ్య, రఘుపతి రెడ్డి,పాండు,చిన్నరెడ్డి,తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *