ప్రాంతీయం

విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టిన లారీ

278 Views

-మహ్మద్ షాపూర్ గ్రామంలో రేషన్ బియ్యం లారీ బీభత్సం
– నిర్లక్ష్యంగా వ్యవహరించిన లారీ డ్రైవర్ పై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
దౌల్తాబాద్: రేషన్ బియ్యం లారీ విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టిన సంఘటన మండల పరిధిలోని మమ్మద్ షాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మమ్మద్ షాపూర్ గ్రామానికి రేషన్ బియ్యం లారీ వచ్చింది. రేషన్ బియ్యం బస్తాలను దింపి గ్రామం నుంచి వెళుతున్న సమయంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో గ్రామంలోనీ విద్యుత్ స్తంభాలను లారీతో ఢీకొట్టాడు. విద్యుత్ స్తంభాలు, స్ట్రీట్ లైట్లు గ కింద పడి పోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా లారీ నడుపుతున్న డ్రైవర్ ను గ్రామస్తులు అడ్డుకొని ప్రశ్నించగా డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రేషన్ బియ్యం లారీ డ్రైవర్ పై సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *