పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్
డిసెంబర్ 22 మెదక్
పార్లమెంట్ సమావేశాల్లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన అగంతకుల చొరవపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బిజేపి ప్రభుత్వం కుట్రపూరితంగా సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజేపి ప్రభుత్వం లో పార్లమెంట్ లో అగంతకులు చేరేలా చేశారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ లో కనీస సెక్యూరిటీ లేకుండా నిర్వహించడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మ్యాకల రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడూరి క్రిష్ణ, బొజ్జ పవన్, ఇస్మాయిల్, మంగ మోహన్ గౌడ్, భూపతి, అశోక్ రెడ్డి, సంజీవ్, ప్రభాకర్, రాజు, కరీం లతో పాటు తదితరులు పాల్గోన్నారు.





