ఓటును అమ్ముకోకండి ఆలోచించి ఓటు వేయండి. భావితరాల భవిష్యత్తుకు బాట వేయండి. మంచి పార్టీని ఎంచుకొని ఆలోచించి ఓటు వేయండి. ఉచిత పథకాలకు ఆశపడకండి, ఉచిత విద్య, వైద్యం కోసం పోరాటం చేయండి.
స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి బార్డర్లో మేము ప్రాణాలు అర్పిస్తున్నాం, మీరు ఓటుకు అమ్ముడుపోయి బానిసలు కాకండి, మా ప్రాణ త్యాగాలను వృధా చేయకండి, అని ఓ ఆర్మీ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటర్లారా, ప్రజలారా ఇకనైనా మారండి. ఓటును అమ్ముకోకండి భావితరాల భవిష్యత్తుకు మంచి పునాది వేయండి. మీ ఓటు హక్కును వినియోగించుకొని మంచి పార్టీని అధికారంలోకి తీసుకురండి, దేశ అభివృద్ధికి తోడ్పడండి.






