పాములపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు-
ముఖ్యమంత్రి కేసీఆర్ కు లక్ష పైగా మెజార్టీ కాయం
నవంబర్ 14
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
గ్రామాలలో ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి,కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించి మరింత అభివృద్ధి మరియు మరిన్ని కొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తాడని,కేవలం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరించారు.గ్రామంలోని ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ ఎంపీపీ పాండు గౌడ్,జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం,వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు కృష్ణ యాదవ్,వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్, పిఏసీఎస్ వైస్ చైర్మన్ బాలరాజు,బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య,నాచారం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ హరి పంతులు,చేబర్తి సర్పంచ్ ఎర్రబాగు అశోక్,బిఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దుర్గాప్రసాద్ గౌడ్, తాడూరి వెంకటేష్ గౌడ్,సిలివేరి శ్రీనివాస్ గౌడ్,జుట్టు సుధాకర్, బోయిని లక్ష్మణ్,చెక్కల రాములు, మండల కో ఆప్షన్ నెంబర్ సహారా నరేష్, నర్సింలు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
