సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసవి నగర్ పిడిచెడ్ రోడ్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపం లో నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు చిన్నారులు మహిళలు భక్తి పాటలు భజనలు కీర్తనలు ఆలపించారు అందరినీ చల్లంగా చూడాలని ఏకదంతుడు శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువుదీరిన వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది గణపతిని పూజిస్తే అంతా మంచి జరుగుతుందని ఆర్యవైశ్య నాయకులు ఉప్పల కృష్ణమూర్తి అన్నారు ఈ కార్యక్రమంలో మహంకాళి శ్రీనివాస్, అత్తెల్లి రాజేశం, ఉత్తునూరి సంపత్, అత్తెల్లి మహేందర్, ఉత్తనూరి శ్రీనివాస్, అత్తెల్లి శ్రీనివాస్,రాజేష్,కృష్ణమూర్తి, ఆర్యవైశ్య నాయకులు, మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు




