సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజీ ఓరియంటేషన్ ప్రోగ్రాం లో ఎమ్మెల్యే కె పి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లిలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాం కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా కొనసాగుతున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం నుండే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించే దిశగా పయనించాలన్నారు. ప్రతి విద్యార్థికి ఈనాలుగు సంవత్సరాల కాలం ఎంతో విలువైనదని, వారి భవిష్యత్తును నిర్దేశించుకునే సమయం అన్నారు. విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా యాజమాన్యం అధ్యాపకబృందం విశేష కృషి చేస్తోందని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ బాల్ రెడ్డి, సెక్రటరీ కె వీ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ టీ సరోజా రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ టీ అనురాధ రెడ్డి, ప్రిన్సిపాల్ కె శ్రీలత, బోర్డు మెంబర్ యూ రాజేశ్వర్ గారు, కొనసాగుతున్నారు.
