Breaking News

ఇందిరా మహిళ శక్తి సంబరాలు

7 Views

మంచిర్యాల జిల్లా :

మందమర్రి మండలం అందుగులపేట సాయిమిత్ర గార్డెన్స్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాలు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య,జిల్లా అధికారులు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు.మహిళ సంఘాలకు 17.21 కోట్ల రూపాయల ను వడ్డీ లేని రుణాల చెక్కును అందించిన మంత్రి.కళ్యాణ లక్ష్మి,షాది మూభరక్ చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి.

మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్.

పేద ప్రజల అభివృద్దే ధ్యేయంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుంది.రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ కు సమాన పనికి సమాన వేతనం,ఉద్యోగ భద్రత కల్పించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. సింగరేణి సంస్థలో పని చేసే ఔట్ సోర్సింగ్ వర్కర్స్ ఉద్యోగులకు మినిమం వేజెస్ పెంచేలా సింగరేణి సిఎండి తో చర్చి.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది.వడ్డీ లేని రుణాల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు,200 యూనిట్ల ఉచిత విద్యుత్,రైతు భరోసా,మహిళలకు ఫ్రీ బస్,గ్యాస్ సబ్సిడీ,కొత్త రేషన్ కార్డులు,రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల ఉచిత వైద్యం అందిస్తుంది. చెన్నూరు నియోజకవర్గం లో 3882 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశాం.3880 మంది పేర్లను రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్లు నమోదు చేయడం జరిగింది.తెలంగాణలో రైతులకు భరోసా కల్పిస్తూ సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది.దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేని సన్న బియ్యం పథకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది.9 వేల కోట్లతో సన్న బియ్యం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.చెన్నూరు నియోజక వర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.ఇల్లు వచ్చిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు తొందరగా చేపట్టాలి.మహిళ సమైక్య సంఘాల తోడ్పాటు అందించేందుకే మహిళా శక్తి పథకం కింద మందమర్రి లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా.మహిళ శక్తి పథకం కింద స్వయం సహాయక మహిళ సంఘాలకు క్యాంటీన్లు,ఎలక్రిక్ బస్సులు,పెట్రోల్ బంక్ లు మంజూరు చేస్తున్నాం.2000కోట్ల రూపాయల ఖర్చుతో మహిళకు ఫ్రీ బస్ సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. 24 వేల కోట్ల రూపాయలను ఏక కాలంలో రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుంది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *