*నిరుపేద మహిళ సారమ్మకు 10 వేలు ఆర్థిక సహాయం*
వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ వాస్తవ్యులు కోటేరు శివారెడ్డి, మాధవి దంపతుల మిత్రబృందం సహాకారంతో వైరా మండలం, ఖానాపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ సారమ్మకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కూలి పనులు చేసుకుని బ్రతికే నిరుపేద కుటుంబానికి చెందిన సారమ్మ భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించారు. సారమ్మకు నలుగురు కూతుర్లు ఉన్నారు. కుటుంబ పోషణకు డబ్బులు చాలక, కూతుర్లను చదివించుకునే స్థోమత లేక దాతల సహాకారం కోసం ఎదురు చూస్తున్న సమాచారం తెలుసుకున్న కోటేరు శివారెడ్డి, మాధవి దంపతులు కొంతమంది దాతలు సహకారంతో శుక్రవారం 10,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భర్త చనిపోయు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సారమ్మ కుటుంబానికి మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, కట్టా రమాకాంత్, నల్లమల శ్రీను, తాళ్లూరి వెంకటేశ్వర్లు, ముదిగొండ హరిబాబు, సోమయాజుల కోటేశ్వర శర్మ, గంధం కృష్ణ, గుండ్ల గోపాలకృష్ణ, మిట్టపల్లి నాగభూషణం, గుండ్ల కళ్యాణి, గుండ్ల సాహితీ తదితరులు పాల్గొన్నారు.
