ప్రాంతీయం

ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చెన్నూరు ఎమ్మెల్యే

74 Views

మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం.

మందమర్రి ఎంపిడిఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి.

*వివేక్  కామెంట్స్*

తెలంగాణ రాష్ట్ర ప్రజల సొంతిటి కలను సహకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టింది.అరులైన లబ్దిదారులందరికీ ఇళ్లను మంజూరు చేస్తాం.ఇందిరమ్మ ఇళ్లు,రైతు భరోసా,రేషన్ కార్డులు అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేసీఆర్ లక్ష 25 వేల కోట్ల రూపాయలను కాళేశ్వరం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు..ఆ నిధులతో రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే అవకాశం ఉండేది.కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది.తెలంగాణ రాష్ట్ర సాధన తో తమ ఆశలన్నీ నెరవేరుతాయని ప్రజలు భావిస్తే కేసీఆర్ ఓటేంద్దు పోకడల వాళ్ళ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన గ్రామసభల్లో గత ప్రభుత్వ తప్పిదాలు కనబడుతున్నాయి.రైతు భరోసా కోసం చేస్తున్న ఫీల్డ్ సర్వేలో సాగుకు యోగ్యంగాలేని భూములకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సినిమా థియేటర్లు ఇటుక బట్టీలకు రైతు బంధు ఇచ్చారు. ఈ విషయాలు అన్ని రైతు సదస్సులో రైతులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సర్వే చేసి అసలైన లబ్ధిదారులను గుర్తించి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.సర్వే పూర్తి అయ్యాక అసలైన లబ్ధిదారులకు ఎకరాకు 12 వేల రూపాయల చొప్పున రైతు భరోసా కల్పిస్తుంది.కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు.రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేదు.. అయినా కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తుంది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్