గంజాయి రవాణా, విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్: 26 గ్రాముల గంజాయి స్వాధీనం
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాల మేరకు పట్టణంలో గంజాయి వినియోగాన్ని రవాణాను పూర్తిగా అరికట్టే చర్యల్లో భాగంగా సిద్దిపేట టూ టౌన్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఉదయం సుమారు 9 గంటల సమయంలో టూ టౌన్ పోలీసులు కెసిఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, గుండ్ల చెరువు సమీపంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ల ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వాళ్ల వద్ద గంజాయి లభ్యమైంది.నిందితుల వివరాలు:కోడూరు సురేష్ (27), తండ్రి: నరసయ్య, నివాసం భరత్ నగర్, సిద్దిపేట, ఆగుళ్ళ ఎల్లేష్ (23) తండ్రి బాబు, నివాసంసిద్దిపేట. వాళ్ళ వద్ద 26 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు.నిందితులిద్దరిని అరెస్ట్ చేసి, వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అనంతరం ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ఉపేందర్,తెలియజేశారు.గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయానికి పాల్పడినా లేదా సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, యువత ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఈ సందర్భంగా సిద్ధిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ హెచ్చరించారు.





