ఆధ్యాత్మికం

ఘనంగా విజయదశమి వేడుకలు…

304 Views

(తిమ్మాపూర్ అక్టోబర్ 23)

విజయ దశమి పండుగ వేడుకలు తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం లో సోమవారం ఘనంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా పండుగను జరుపుకున్నారు.

గ్రామ ప్రజలు కొత్త బట్టలు ధరించి పాలపిట్టను దర్శించుకుని, ఊరూవాడ ముస్తాబై గ్రామపంచాయతీ వద్దకు చేరుకొని, భూలక్ష్మి,మహాలక్ష్మి, బొడ్రాయి విగ్రహాల వద్ద అర్చకుడు విజయ శర్మ నిర్వహించిన పూజలో పాల్గొని, శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం జమ్మి ఆకులు ఒకరికి ఒకరు ఇచ్చుకుంటు,ఆలింగనం చేసుకుంటూ గ్రామ ప్రజలు సంతోషంగా దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *