ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి, మండల కేంద్రంలోని పోచమ్మ యూత్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రతిష్టింపబడి పూజలు అందుకుంటున్న అమ్మవారు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకవరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏల్లబాల్ రెడ్డి, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గజలరాజు, యూత్ అధ్యక్షుడు తాళ్ల విజయ్ రెడ్డి, ఆరుట్ల మహేష్ రెడ్డి,
ఏదునూరి భానుచందర్, తిరుపతిరెడ్డి తదితర నాయకులు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.




