ప్రాంతీయం

పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలి

180 Views

భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు ప్రకటన తోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు అమల్లోకి రానున్నందున ఇప్పటినుంచే ఎస్ఎస్ టి, ఎఫ్ ఎస్ టి, వివిటి, వి ఎస్ టి, ఎంసీఎంసీ బృందాలు ఎంపీసీ పై అవగాహన పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి బృంద బాధ్యులకు సూచించారు. తద్వారా

శనివారం ఐడిఓసి ప్రజావాణి హాల్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెక్టార్ ఆఫీసర్ లు, సెక్టార్ పోలీస్ ఆఫీసర్ లు, ఎస్ఎస్ టి, ఎఫ్ ఎస్ టి, వివిటి, వి ఎస్ టి, ఎంసీఎంసీ బృందాల సభ్యులకు ఎన్నికల విధులపై మాస్టర్ ట్రైనర్ ల తో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ను పాటించడం, అమలు చేయడం ఉద్యోగుల బాధ్యత అని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఉండేందుకు అధికారులు 100 శాతం న్యూట్రాలిటి పాటించాలని చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై పూర్తి అవగాహన కలిగి ఉండి

షెడ్యూల్ విడుదలైన వెంటనే బృందాలు తమ పనిని ప్రారంభించాలన్నారు. ఇందుకు సంబంధించిన మెటీరియల్ ను కూడా అందరికీ పంపిణీ చేస్తామని చెప్పారు. షెడ్యూల్ వచ్చిన వెంటనేతమ కార్యకలాపాలకు సంబంధించి రిపోర్ట్ ను ఎప్పటికప్పుడు బృందాలు పంపించాల్సి ఉంటుందన్నారు ఎలక్షన్ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి రాజకీయ పార్టీలు సువిధ ఆప్ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

షెడ్యూల్ వచ్చిన 24 గంటల లోగా ప్రభుత్వ స్థలాలు, భవనాల పై ఉన్న రాజకీయ పార్టీల గుర్తులు, పోస్టర్ లు, వాల్ రైటింగ్, బ్యానర్ లు తొలగించాలని చెప్పారు. ప్రైవేట్ స్థలాలలో రాజకీయ పార్టీల గుర్తులు, పోస్టర్ లు, వాల్ రైటింగ్, బ్యానర్ లు ఉంటే వాటి యజమాని అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

సెక్టార్ పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిక్కచ్చిగా అమలయ్యేలా , ఎన్నికలు స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడడంలో సెక్టార్ ఆఫీసర్ లు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ….

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత దేశమని , ఇక్కడ ఎన్నికల క్రతువునుపారదర్శకంగా నిర్వహిస్తారన్న పేరు, నమ్మకం అధికారులకు ఉందన్నారు. దానినీ బాధ్యత తోమరింత ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పారు.

ఎన్నికల షెడ్యూల్ కు ముందే అన్ని బృందాల సభ్యులకు తమ విధులు బాధ్యతలు మోడల్ కూడా కండక్టు గురించి వాటిలో వచ్చే అంశాల గురించి సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు .ఆలర్ట్ గా ఉండి షెడ్యూల్ రాగానే ఎన్నికలు సజావుగా జరిగేందుకు వెంటనే తమ పనిని అధికారులు ప్రారంభించాలన్నారు

 

ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారాఎస్ఎస్ టి, ఎఫ్ ఎస్ టి, వివిటి, వి ఎస్ టి, ఎంసీఎంసీ సభ్యులకు ఎంపీసీ పై అవగాహన. కల్పించారు.సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్, డీస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్ర చారి తదితరులు పాల్గొన్నరు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *