ఖమ్మం:27.09.2023
————————
ఖమ్మం నగరం 10వ డివిజన్ చైతన్య నగర్ నగర్ లో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు..
ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు, అభివృద్ది పట్ల ఎంతో అవగాహన కలిగిన వారు.
ఖమ్మం నగరంలో చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద గా ఆలోచన చేసి సమస్యలను సమూలంగా తొలగించి పరిస్కరించాం..
కేవలం నగరం అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఒక్కో డివిజన్ కు 10 నుండి 13 కోట్ల రూపాయలు అందించాం..
ఒకప్పుడు ఖమ్మం నియోజకవర్గం కు ఇచ్చే నిధులు నేడు ఒక్క డివిజన్ కు ఇచినం.. ఇంకా ఇస్తాం.. ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన దాఖలాలు లేవన్నారు.
ఖమ్మం నగరంలో లకారంలో తెప్పోత్సవం చేసిన ఘనత మనది.. శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గోదావరిలో అంగరంగ వైభవంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామీ వారి తెప్పోత్సవం మాదిరిగా ఖమ్మం లకారంలో చేసుకున్నాం. ఇది మనకు ఎంతో ఆశీర్వాదకరం.
ఖమ్మం బైపాస్ రోడ్ నందు రూ.5 కోట్లతో అయ్యప్ప భక్తుల కోసం వైభవోపేతంగా అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతుంది.. రానున్న రోజుల్లో ఖమ్మం అన్ని రంగాలకు వేదికగా నిలువనుంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరు వస్తారు… దొంగ దండాలు పెడతారు.. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడతారు. అలాంటి వారిని నమ్మితే మళ్ళీ 10ఏళ్లు వెనక్కు పోతామన్నరు.
కార్పొరేటర్ చావా మాధురి నారాయణ రావు అధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో తాతా మధు, ఎంపి లు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మల్యే లు హరిప్రియ నాయక్, రాములు నాయక్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, తాళ్లూరి దిలీప్, స్వర్ణ నాగేశ్వరరావు, వి.రాధ కృష్ణ, తుపాకుల వేంకటేశ్వర రావు, మువ్వ శ్రీనివాస్, కొండబోయిన రామారావు, పావురాల రామకృష్ణ, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.
