(కరీంనగర్ జిల్లా సెప్టెంబర్ 12)
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా టీపీసీసి అధిష్టానం పీసీసీ నూతన కమిటీలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా కు చెందిన మేనేని రోహిత్ రావు ను టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసారు.
ఈ సందర్బంగా మేనేని రోహిత్ రావు మాట్లాడుతూ..
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని గుర్తించి ఈ అత్యున్నత అవకాశన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని. కెసిఆర్, మోడీ చేస్తున్న అవినీతి పాలనను ఎండగడుతూ కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. అదే విధంగా తన నియామకానికి సహకరించిన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి, కృతజ్ఞతలు తెలుపుతూ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి కి, డిసిసి అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ కి,టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.