Breaking News

గద్దర్ భార్యకు ప్రధాని మోదీ ఓదార్పు లేఖ.* హైదరాబాద్:ఆగస్టు 25

110 Views

*గద్దర్ భార్యకు ప్రధాని మోదీ ఓదార్పు లేఖ.*

హైదరాబాద్:ఆగస్టు 25

ప్రజాకవి గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు గద్దర్ మృతిని తెలుసుకొని చాలా బాధపడినట్లు తెలిపారు.

ఈ మేరకు గద్దర్ భార్య గుమ్మడి విమలకు ప్రధాని మోదీ లేఖ రాశారు తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను.

గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయి. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

మీ దుఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఓం శాంతి అంటూ ప్రధాని మోదీ లేఖలో పేర్నొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *