అమరుడు..పీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు .
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట లో ని దొంత భూమయ్య కుమారులు ఇద్దరు. ఒకరు జేఏసీ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి సాగించారు చిన్న కుమారుడు దొంత మార్కండేయ అలియాస్ శంకర్ అతని పేరు చెప్తేనే పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా నిజామాబాద్ జిల్లాలోని అతని పేరు చెప్తే కొంతమంది కన్నీటి పర్యంతమవుతారు నిజామాబాద్ జిల్లా శంకరన్నకు పెట్టిన పేరు సొంత గ్రామం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒకప్పుడు ఎవరికి తలవంచకుండా ఉండే కుటుంబం కుమారుడు పార్టీలో చేరడం తండ్రి మరణం తల్లి మరణం అన్న ఉద్యోగ హైదరాబాదులో ఉండడం ఇంటిలో చిన్న కుమార్తె మతిస్థిమితం లేక ఆమె కూడా మరణించడం జరిగింది. ఇంకో ఇంకో కుమార్తె భర్త మరణించడం ఇంటిపై ఉండడం ఇల్లు లేక కిరాయి ఇంటిలో ఉండడం ఆ ఇంటిని పట్టించుకునే నాధుడు లేక. చిన్న ఇల్లు ఒక పీపుల్స్ వార్ అగ్ర నాయకుడుగా ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా పార్టీ సిద్ధాంతాల కొరకు పనిచేసి అమరుడయ్యాడు అలాంటి ఇల్లు గురువారం కుప్పకూలింది . ఈ సంఘటన కొంతమంది సానుభూతిపరులను కలిచి వేసింది అక్క చెల్లె భర్త చనిపోవడం ఆమె అద్దెకు ఉండడం ప్రస్తుతం జీవనం గడుపుతోంది ఇల్లు కూలిపోవడంతో దిగ్భ్రాంతికి లోనయ్యింది ప్రభుత్వం తరఫున అంతేకాకుండా దాతలు సహాయం చేస్తారని ఎదురుచూపులు చూస్తోంది (గతం లో పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శి గా పనిచేసిన దొంత మార్కండేయ అలియాస్ శంకర్ వారి ఇళ్ళు రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయింది.ఇంట్లో ఎవరు నివాసం ఉండకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఇదే ఇంటి ప్రక్కనే ఉన్న దేశ్ పాండి లక్ష్మి (రామచంద్రం) కూలిన ప్రభావం వల్ల తమ ఇంటికి నష్టం వాటిల్లిందని దేశ్ పాండి లక్ష్మి వాపోయారు.తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
